రైతు సంఘం ప్రతినిధులతో సుప్రీం ప్యానెల్​ భేటీ
SC

సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్​.. అఖిల భారత కిసాన్​ సమన్వయ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ఈ భేటీలో పాల్గొన్న ఏఐకేసీసీ ప్రతినిధులు.. వ్యవసాయ చట్టాలపై తమ వివరణాత్మక అభిప్రాయాలు, సూచనలు కమిటీకి తెలిపారని అధికారులు పేర్కొన్నారు.

అఖిల భారత కిసాన్​ సమన్వయ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ. నూతన సాగు చట్టాలపై వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు దిల్లీలోని జాతీయ వ్యవసాయ శాస్త్ర కార్యాలయంలో ఏఐకేసీసీ ప్రతినిధులతో కమిటీ చర్చలు జరిపినట్లు ఓ ప్రకటనలో తెలిపారు అధికారులు.

ఈ భేటీలో పాల్గొన్న ఏఐకేసీసీ ప్రతినిధులు.. వ్యవసాయ చట్టాలపై తమ వివరణాత్మక అభిప్రాయాలు, సూచనలు కమిటీకి తెలిపారని పేర్కొన్నారు. అనిల్‌ ఘన్వాత్‌, డాక్టర్​ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలతో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్​.. ఆన్‌లైన్​ సహా వ్యక్తిగతంగానూ రైతు ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

సాగు చట్టాల విషయమై రైతులు-కేంద్రానికి మధ్య 11 సార్లు చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం రాలేదు. 18 నెలలు సాగు చట్టాల అమలును నిలిపివేస్తామని కేంద్రం ప్రతిపాదించినా.. రైతులు అందుకు అంగీకరించలేదు.

ఇదీ చూడండి: గల్వాన్​​ యోధుడిని సత్కరించిన సీఎం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.