పరస్పర విమర్శలను సహించేది లేదు.. నేతలకు బాబు క్లాస్

ఏపీలోని విజయవాడ నగర తెదేపాలో కలహాలపై పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు సహించేది లేదని హెచ్చరించారు. నేతల పరస్పర విమర్శల వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు సహించేది లేదని హెచ్చరించారు. నేతల పరస్పర విమర్శల వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తాయని తేల్చిచెప్పారు. 39వ డివిజన్ అభ్యర్థిని నిర్ణయించే వరకు వేచి చూడాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్ దక్కదు: రఘునందన్