అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపైనే వైకాపా దృష్టి: చంద్రబాబు
అధికార

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో 4వ విడత 41.7 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నాలుగు విడతలు కలిపి 4,230 సర్పంచ్ స్థానాలు గెలిచామన్నారు. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే ఇంకో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేదన్నారు. అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారు మీద వైకాపా ఎక్కువ ఆధారపడిందని మండిపడ్డారు.ఎన్నికలు సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని చంద్రబాబు ప్రశ్నించారు.

అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపైనే వైకాపా దృష్టి: చంద్రబాబు

"ప్రజలను వేధించే ప్రభుత్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. వైకాపా పతనం ప్రారంభమైంది.. ఎవరూ కాపాడలేరు. అధికార దుర్వినియోగం, అరాచకాలు సృష్టించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తెదేపా వీరోచితంగా పోరాడింది. విపరీతంగా ధరలు పెంచి పన్నుల భారం మోపారు. 4వ విడతలో 41.7 శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం. 4 విడతలు కలిపి 4,230 సర్పంచ్ స్థానాలు గెలిచాం. సక్రమంగా జరిగి ఉంటే మరో 10 శాతం స్థానాల్లో విజయం సాధ్యమయ్యేది. అధికార దుర్వినియోగం, ఫలితాల తారుమారుపై వైకాపా ఆధారపడింది. 22 ఏళ్లు తెదేపా అధికారంలో ఉంది.. రెండేళ్లకే మిడిసిపడుతున్నారు."- చంద్రబాబు, తెదేపా అధినేత

ఆంధ్రప్రదేశ్​లో జరిగిన నాలుగు దశల పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వీరోచితంగా పోరాడారని చంద్రబాబు అభినందించారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా కార్యకర్తలు చూపించిన తెగువ అభినందనీయమన్నారు. వైకాపా పతనం ఆరంభమైందన్న చంద్రబాబు.. సర్వశక్తులు ఒడ్డినా ఈ పతనం ఇంతటితో ఆగదని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు తెదేపా మంచితనాన్నే చూశారన్న చంద్రబాబు ఇకపై అలా ఉండదని హెచ్చరించారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమన్నారు. అబద్దాలు చెప్పడంలో ముఖ్యమంత్రి దిట్ట అని విమర్శించారు. అర్ధరాత్రి నాటకాలు.. మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో పట్టణ ప్రజలను ప్రభావితం చేయలేదన్నారు. ప్రజా చైతన్యంతో అరాచకాలు, ప్రలోభాలను అడ్డుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఎన్నికలు సక్రమంగా నిర్వహించామని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. ప్రజల తిరుగుబాటుతో కొన్నిచోట్ల అధికారులు తోకముడిచారన్న చంద్రబాబు.. తిరుగుబాటు లేనిచోట ఇష్టానుసారం వ్యవహరించారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 6 శాతం ఓటింగ్ తగ్గిందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.

ఇదీ చదవండి: తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభి వాణీదేవి నామినేషన్

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.