
యాసంగి సీజన్లో ధాన్యం సేకరణపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల సమీక్షించారు. ధాన్యం సేకరణ, భారత ఆహారసంస్థ నిబంధనలు, చౌకధర దుకాణాలపై సమావేశంలో చర్చించారు.
యాసంగి సీజన్లో ధాన్యం సేకరణ కోసం అవసరమైన గన్నీబ్యాగుల సేకరణ సహా ఇతర అంశాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులతో సచివాలయంలో మంత్రి సమావేశమయ్యారు.
ధాన్యం సేకరణ, భారత ఆహారసంస్థ నిబంధనలు, చౌకధర దుకాణాలపై సమావేశంలో చర్చించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. బీసీ సమాఖ్యలు, స్వయం ఉపాధి పథకాలపై చర్చించారు. అన్ని అంశాలపై తగిన నిర్ణయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఇవీచూడండి : హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ కారును ఢీకొట్టిన లారీ