
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.
1.అభ్యర్థి ఖరారు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిని ఖరారు చేశారు. గులాబీ పార్టీ అభ్యర్థిగా సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.కమలం గూటికి శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.. అనుకున్నట్టుగానే కమలం గూటికి చేరారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.తెలంగాణకు రెండో స్థానం
రాష్ట్రంలో 86,745 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రెండో డోస్ టీకాలు వేశారని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ తెలిపారు. రెండో డోస్ ఇవ్వడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండడం సంతోషకరమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.మాతృభాషలోనే మాధుర్యం
మాతృభాష.. ప్రతి బిడ్డ 'అమ్మ ఒడి'లో నేర్చుకునే భాష. అప్రయత్నంగానే ప్రతి మనిషి అణువణువులో జీర్ణించుకుపోయేది. కాలానుగుణంగా పరభాషా మోజులో అనేక మంది అమ్మభాషని మర్చిపోతున్నారు. అందుకే యునెస్కో ఏటా ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్‌లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా...పలువురు వక్తలు మాతృభాషా మాధుర్యాన్ని, పరిరక్షించాల్సిన అవశ్యకతను వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.సాగుచట్టాలపై మోదీ
నూతన సాగు చట్టాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భాజపా నేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆ పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 23 నుంచి నిరసనలు ఉద్ధృతం
నూతన సాగు చట్టాల రద్దుకోసం ఉద్యమిస్తున్న రైతులు.. ఈ నెల 23 నుంచి 27 వరకు వరుస నిరసన కార్యక్రమాల్ని చేపట్టనున్నారు. తమ ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు త్వరలోనే ఓ వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. బంగాల్లో తగ్గింపు
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు కొండెక్కుతున్న వేళ.. పెట్రోలు, డీజిల్‌పై రూ.1 చొప్పున తగ్గించింది బంగాల్ సర్కారు. ఈ సవరించిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.చర్చల్లో పురోగతి
తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై భారత్-చైనా మరింత పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాలు బలగాలను వెనక్కి మరలించగా.. పదో విడత చర్చల్లో ఇతర ప్రాంతాలపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్చల్లో గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్ వద్ద బలగాల ఉపసంహరణకు ఇరు పక్షాలు అంగీకరించగా.. దేప్‌సంగ్, దెమ్‌చొక్ ప్రాంతాలపై ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.ఛాంపియన్‌గా జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ గెలుపొందాడు. ఫైనల్ ప్రత్యర్థి మెద్వెదెవ్‌ను 7-5, 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.శంకర్ దర్శకత్వంలో రణ్వీర్?
ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో నటించాలని భావిస్తున్నాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. ఇందుకోసం ఇటీవల చెన్నై వెళ్లి శంకర్‌ను కూడా కలిశాడని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.