
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.
1.నేడే తుది గడువు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.మార్చిలో భూసమగ్ర సర్వే
తెలంగాణలో ప్రతి అంగుళాన్ని కచ్చితంగా కొలవడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. మార్చి నెల చివరిలో సమగ్ర భూ సర్వేను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.'అదుపులోనే ఉంది'
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వైరస్ ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ.... భయాందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, కేరళలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో.... సరిహద్దు జిల్లాల్లో వైరస్ నివారణ చర్యలపై దృష్టిసారించామని వైద్యాధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.ఘోరప్రమాదం
బిహార్ కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్సిలా ప్రాంతంలో ట్రక్కు- కారు ఢీకొనడం వల్ల 8మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.వరవరరావుకు బెయిల్
విరసం నేత వరవరరావుకు ముంబయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని నెలల తరబడి పోరాడుతున్న ఆయన కుటుంబసభ్యులకు ఊరట లభించింది. పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వరవరరావు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.ఆసుపత్రి ప్రారంభించనున్న మోదీ
ఐఐటీ ఖరగ్‌పుర్‌లో నిర్మించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసర్చ్ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. అలాగే.. ఐఐటీ ఖరగ్‌పుర్ 66వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.భారీ పేలుడు
కర్ణాటకలోని హిరెనాగవేలి గ్రామంలో జిలెటిన్ పేలిన కారణంగా ఐదుగురు మృతి చెందారు. హిరెనాగవేలిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.పెట్రో బాదుడు
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, లీటరు డీజిల్‌పై 35 పైసలు పెంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.మెరిసిన తెలుగు కుర్రాడు
జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ మెరిశాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సుష్మిత్ శ్రీరాంపై నెగ్గి, సెమీస్‌కు చేరిన స్నేహిత్.. దాదాపుగా పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.జూ.ఎన్టీఆర్‌కు విలన్‌గా!
తారక్ తర్వాతి సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో విజయ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆదరణ పొందడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.