నేటి నుంచి పూర్తిస్థాయిలో టీఎస్‌-బీపాస్‌ విధానం అమలు
Breaking

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్‌- బీపాస్‌ విధానం నేటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఇవాల్టి నుంచి యజమానులు ఇంటి నిర్మాణానికి టీఎస్‌- బీపాస్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసి అనుమతులు పొందాల్సి ఉంటుందని మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతికి, ఆలస్యానికి తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్‌- బీపాస్‌ విధానం నేటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది. మూడు నెలల క్రితమే అమల్లోకి వచ్చినప్పటికీ పాత విధానమైన డీటీసీపీ ద్వారానే అధికంగా భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు.

ఇవాల్టి నుంచి యజమానులు ఇంటి నిర్మాణానికి టీఎస్‌- బీపాస్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసి అనుమతులు పొందాల్సి ఉంటుందని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. ప్రజలు మీసేవా కేంద్రం, టీఎస్‌- బీపాస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. అయితే జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే బీపాస్‌ విధానం అమలవుతోంది.

ఇదీ చదవండి: నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్‌

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.