
మహిళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం కేరళ, తమిళనాడు పర్యటనకు వెళ్లింది. అక్కడి సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, గ్రామీణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల బృందం అధ్యయనం చేయనుంది.
మహిళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు తరలివెళ్లింది. కేరళలో చిన్నారులకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తుందన్నారని... గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ తెలిపారు.
ఈ విషయంలో కేరళ రాష్ట్రం మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ బృందం విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, గ్రామీణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల బృందం అధ్యయనం చేయనుంది.