కేరళ పర్యాటక శాఖ సంచాలకులుగా.. కృష్ణతేజ

కేరళ పర్యాటక శాఖ సంచాలకులుగా తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ నియామకమయ్యారు. రెండేళ్ల కిందట కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సమయంలో అలిప్పి సబ్‌కలెక్టర్‌గా ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది.
కేరళ పర్యాటక శాఖ సంచాలకులుగా తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ నియమితులయ్యారు. ప్రస్తుతం పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయనకు అదే శాఖలో తాజాగా సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రెండేళ్ల కిందట కేరళలో వరద బీభత్సం సృష్టించిన సమయంలో సహాయ చర్యలను చేపట్టడంలో అలిప్పి జిల్లా సబ్‌కలెక్టర్‌గా కృష్ణతేజ చూపించిన చొరవ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.
- ఇదీ చూడండి : కేరళ: వరద బీభత్సం- జనజీవనం అతలాకుతలం