
జీహెచ్ఎంసీ నూతన మేయర్, డిప్యూటీ మేయర్లు ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో బాధ్యతలు తీసుకోనున్నారు. ఉదయం 9.30 గంటలకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరిస్తారు.
గ్రేటర్ హైదరాబాద్ మహనగర పాలక సంస్థ నూతన మేయర్‌గా ఎన్నికైన గద్వాల్ విజయలక్ష్మి నేడు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్యాంక్‌బండ్ బీఆర్కే భవన్ పక్కన గల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఉదయం 9.30 గంటలకు తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు... రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, ఇతర మంత్రులు హాజరుకానున్నారు. ఈ నెల 11వ తేదీన మేయర్, ఉపమేయర్ ఎన్నికయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఈ పదవుల్లో ఐదేళ్ల వరకు ఉండనున్నారు.