పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు
graduate

14:54 February 23

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది. 

హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు.  

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్​నగర్‌ స్థానానికి తెరాస తరఫున సురభి వాణీదేవి, భాజపా నుంచి రాంచందర్‌రావు, కాంగ్రెస్​ నుంచి చిన్నారెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్​ నాగేశ్వర్​ నామపత్రాలు సమర్పించారు.  

వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి తెరాస తరఫున పల్లా రాజేశ్వర్​రెడ్డి, భాజపా నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్​ తరఫున రాములు నాయక్​, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి, స్వతంత్ర అభ్యర్థులు తీన్మార్‌ మల్లన్న, సుదగాని హరిశంకర్‌ నామపత్రాలు దాఖలుచేశారు.  

 

ఇవీచూడండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.