
ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
- తెరాస నామినేషన్ వెనక్కి..
తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి బీ-ఫాం అందుకున్న వాణీదేవి... మంత్రులతో కలిసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే నామినేషన్ ఫారం సరైన ఫార్మాట్‌లో లేనందున రేపు మరోమారు నామపత్రాన్ని దాఖలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఓటుతో గుణపాఠం చెబుదాం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీ మోహన్ ఆత్మహత్య!
దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్(58) అనుమానాస్పద స్థితిలో మరణించారు. దక్షిణ ముంబయిలోని ఓ హోటల్‌లో ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పక్కనే గుజరాతీలో రాసి ఉన్న సూసైడ్ నోట్ దొరికిందన్న వార్తలు రాగా.. వాటిపై స్పందించేందుకు అధికారులు నిరాకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు!
కొరొనిల్ టాబ్లెట్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఐఎంఏ డిమాండ్ చేసింది. తమ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించిందని పతంజలి సంస్థ చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉన్నావ్ కేసులో 'ఫేక్ పోస్టు'లపై..
ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ ఘటనపై నకిలీ వార్తలను పోస్ట్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 8 ట్విట్టర్ ఖాతాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. వీటిలో సీనియర్ జర్నలిస్ట్ బార్కా దత్‌కు చెందిన 'మోజో స్టోరీ' ఖాతా సైతం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'గ్రే' లిస్ట్‌లోనే పాక్!
ఉగ్ర కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్.. జూన్ వరకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ 'గ్రే' జాబితాలోనే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆ దేశం గురించి అధికారులు, రాయబారులు చర్చించగా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు పాక్ పత్రిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'
15వ ఆర్థిక సంఘం నివేదికను రూపొందించే సమయంలో ఎదురైన సవాళ్లను ఇటీవీ భారత్‌కు ప్రత్యేకంగా వివరించారు ఛైర్మన్ ఎన్కే సింగ్. కరోనా సంక్షోభం అనంతరం నివేదికకు మార్పులు చేసినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సెన్సెక్స్ 1,145 డౌన్
స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదో రోజూ బేర్ విజృంభణ కొనసాగింది. సెన్సెక్స్ 1,145 పాయింట్లు కోల్పోయి 49,800 దిగువకు చేరింది. నిఫ్టీ 306 పాయింట్లు తగ్గింది. 30 షేర్ల ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా భారీగా నష్టాన్ని మూటగట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'టీ20 వరల్డ్‌కప్ మనదే!'
ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ఇతర జట్లతో పోలిస్తే టీమ్ఇండియా గొప్పగా ఆడుతోందని ప్రశంసించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలీవుడ్ హీరోకు గాయాలు
బాలీవుడ్ హీరో టైగర్‌ష్రాఫ్.. ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. హీరోయిన్ దిశా పటానీ.. ఆ సమయంలో అతడితో పాటే ఉండి జాగ్రత్తగా చూసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.