
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
- బోధన్ పాస్‌పోర్టుల కేసులో..
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నకిలీ పాస్‌పోర్టుల కేసులో 11 మంది ప్రధాన సూత్రదారులు ఉన్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఆధార్, ఇతర పత్రాలతో పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం.. నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గాలకు పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మొక్కు చెల్లించాలంటే.. డబ్బులవ్వాల్సిందే
పుణ్యక్షేత్రాలకు వెళ్లినవారు దైవదర్శనం చేసుకుని.. మానసిక ప్రశాంతత పొందుతారు. అక్కడ మాత్రం డబ్బులు ఉంటేనే దేవుణ్ని చూడగలుగుతారు. లేదంటే చీత్కారాలు, చీదరింపులే మిగులుతాయి. ఏళ్లు గడుస్తున్నా... ఆ పుణ్యక్షేత్రంలో వసూళ్ల దందా మాత్రం ఆగడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ..
కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. రోజురోజుకు పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోతోంది. పుదుచ్చేరిలోనూ అధికారానికి దూరం కావడం ఇప్పుడు కాంగ్రెస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. సమస్యల సుడిగుండంలో ఉన్న కాంగ్రెస్.. వచ్చే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందో? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వెయ్యి చెరువులు మాయం!
తమిళనాడులో నీటి కుంటలు, చెరువులు, సరస్సులు రానురాను మాయమవుతున్నాయని ప్రజా పనులు విభాగం మాజీ అధికారులు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. అధికారుల ఉదాసీనత, ప్రజలు నిర్లక్ష్యం కారణంగా 50ఏళ్లలో సుమారు వెయ్యికి పైగా జల వనరులు కబ్జాకు గురైనట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లైంగిక విద్యపై బాలీవుడ్ భామ కామెంట్స్
పిల్లలకు లైంగిక విద్య నేర్పడం ఎంతో అవసరమంటోంది బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెల. ఒక నటిగా, మోడల్‌గా సమాజం పట్ల తనకెంతో బాధ్యతుందన్న రౌతెల.. ఇటీవలే ఆశిష్ పాటిల్ దర్శకత్వంలో రూపొందిన 'సెక్స్ దాట్ విత్ పప్పు అండ్ పాపా' అనే వెబ్ సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 14 ఏళ్ల బాలికతో ఎంపీ పెళ్లి!
పాకిస్థాన్ ఎంపీ మౌలానా సలాహుద్దీన్ 14 ఏళ్ల మైనర్‌ను వివాహం చేసుకున్నారని చిత్రాల్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ ఏడాది సగటున 7.7% వేతనాల పెంపు!
కరోనా నుంచి వ్యాపారాలు క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో 2021లో భారత్‌లో ఉద్యోగులకు సగటున 7.7 శాతం చొప్పున వేతనాలు పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. సర్వేలో వెల్లడైన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గులాబీ బంతి.. ఎందుకింత స్పెషల్?
భారత్-ఇంగ్లాండ్ మధ్య డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 24) ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు స్వదేశంలో ఒకే ఒక్క డేనైట్ మ్యాచ్ ఆడింది టీమ్ఇండియా. తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వారితో ఓ గులాబీ టెస్టులో తలపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇరువురు భామలు.. ఇరుకున హీరోలు!
హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కిక్కే వేరు. వారిద్దరితో కథానాయకుడు చేసే రొమాన్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. హీరో ఏ నాయికని ప్రేమిస్తాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? అనే ఉత్కంఠ కూడా ఉంటుంది. ఇలా టాలీవుడ్లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు చాలానే వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.