
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
- రేపట్నుంచే 6,7, 8 తరగతులు..
ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్షబోధన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే పిల్లల్ని అనుమతించాలని... ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏఐ విలువలపై రాజీపడితే పెనుముప్పు తప్పదు
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో చర్చవేదికలో భాగంగా... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వైద్యరంగంలో ఏఐది కీలకపాత్ర అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కేటీఆర్ అడిగిన పలు సందేహాలను సత్య నాదెళ్ల నివృత్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రేపు కేటీఆర్ కీలక సమావేశం
పార్టీ నేతలతో.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు ఖరారుచేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముగిసిన నామినేషన్ల గడువు
రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్ పురపోరులో భాజపా జోరు
గుజరాత్ పుర పోరులో భాజపా స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మొత్తం ఆరు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు కమల దళానికి పూర్తి స్థాయిలో మెజారిటీని కట్టబెట్టారు. మొత్తం 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా.. 466 చోట్ల భాజపాదే ఆధిక్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతు సంఘం ప్రతినిధులతో సుప్రీం ప్యానెల్ భేటీ
సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్.. అఖిల భారత కిసాన్ సమన్వయ కమిటీ(ఏఐకేసీసీ) ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. ఈ భేటీలో పాల్గొన్న ఏఐకేసీసీ ప్రతినిధులు.. వ్యవసాయ చట్టాలపై తమ వివరణాత్మక అభిప్రాయాలు, సూచనలు కమిటీకి తెలిపారని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్‌ను జయించినా..
కొవిడ్ బారి నుంచి బయటపడినా... కొంత మంది చాలా కాలం పాటు అనోస్మియా సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెడ్ అండ్ నెక్ వైద్య నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.337 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.1,149 పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మొతేరాలో సందడికి వేళాయే..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో బుధవారం (ఫిబ్రవరి 24) భారత్-ఇంగ్లాండ్ జట్లు డేనైట్ టెస్టులో తలపడనున్నాయి. ఈ మైదానాన్ని అత్యాధునికంగా నిర్మించిన తర్వాత జరుగుతోన్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. ఈ నేపథ్యంలో మొతేరా స్టేడియం సామర్థ్యం, ప్రత్యేకతలు, విశేషాలపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 15 ఏళ్ల తర్వాత చిరుతో ఆ హీరోయిన్?
అగ్రకథానాయకుడు చిరంజీవితో కలిసి మరోసారి నటించేందుకు త్రిష సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని సంగతేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.