టాప్​టెన్​ న్యూస్​@9PM
Breaking

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌..

హైదరాబాద్​ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దేనికైనా హైదరాబాద్​ నుంచే టీకా రావాలి

భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్లాను జినోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్​లెన్స్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తన ఒక్కరిది కాదని.. ఫార్మా, లైఫ్ సెన్సెస్​ ఎకోసిస్టమ్​కు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • న్యాయవాది కారును ఢీకొట్టిన లారీ

జనగామ జిల్లా యశ్వంత్‌పూర్‌ వద్ద హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ప్రమాదం నుంచి న్యాయవాది దుర్గాప్రసాద్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇది ప్రమాదం కాదని.. తనను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నమని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు..

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు మంగళవారం గడువు ముగియనుండగా... పలువురు అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. మంచిరోజు కావడం వల్ల ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'బంగాల్​లో సిండికేట్ రాజ్యం'

బంగాల్​ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. హుగ్లీలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో సిండికేట్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. సామాన్యులు డబ్బులు ఇవ్వకుండా ఒక్క పనీ జరగడం లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయి'

ప్రజలు ఏకమైతే ప్రభుత్వాలు మారిపోతాయని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. హరియాణాలో నిర్వహించిన ' కిసాన్​ మహా పంచాయత్​'లో ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​కు చైనా మద్దతు!

భారత్​లో ఈ ఏడాది జరగనున్న బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సుకు తమ మద్దతు ఉంటుందని చైనా తెలిపింది. ఐదు సభ్యదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్​తో కలిసి పని చేస్తామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐదో రోజూ బేర్​..

స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదో రోజూ బేర్​ విజృంభణ కొనసాగింది. సెన్సెక్స్ 1,145 పాయింట్లు కోల్పోయి 49,800 దిగువకు చేరింది. నిఫ్టీ 306 పాయింట్లు తగ్గింది. 30 షేర్ల ఇండెక్స్​లో టెక్ మహీంద్రా భారీగా నష్టాన్ని మూటగట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒలింపిక్స్​ ఆటగాళ్లకు త్వరలోనే..

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే ఆటగాళ్లకు త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు టీకా పంపిణీ జరుగుతోందని, అనంతరం అథ్లెట్లకు వ్యాక్సినేషన్​ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ఉప్పెన' టీమ్​కు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్​లు

'ఉప్పెన' ప్రేక్షకుల్ని అలరిస్తున్న నేపథ్యంలో చిత్రబృందం మొత్తానికి ప్రత్యేక బహుమతులు పంపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వాటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.