టాప్​టెన్ న్యూస్ @ 9AM
top

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • వారికి మార్చిలో టీకా

యాభై ఏళ్లకు పైబడినవారికి, ఆలోపు వయసున్న దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాల పంపిణీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో 80 లక్షలమందికి టీకాలివ్వాలని నిర్ణయించగా... అందులో 70 లక్షలకుపైగా 50 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బయోఆసియా సమావేశం

హైదరాబాద్ వేదికగా జీవశాస్త్రంలో అతిపెద్ద సదస్సు బయో ఆసియా - 2021 జరగనుంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సు.. ఈసారి కోవిడ్ నేపథ్యంలో వర్చువల్గా నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్న బయో ఆసియా సదస్సులో ఆరోగ్యరంగానికి కోవిడ్ విసిరిన సవాళ్లు.. హెల్త్ కేర్లో టెక్నాలజీ అవకాశాలపై విస్తృత చర్చ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • పూర్తిస్థాయిలో టీఎస్‌-బీపాస్‌

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీఎస్‌- బీపాస్‌ విధానం నేటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఇవాల్టి నుంచి యజమానులు ఇంటి నిర్మాణానికి టీఎస్‌- బీపాస్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసి అనుమతులు పొందాల్సి ఉంటుందని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేడే పుదుచ్చేరిలో బలనిరూపణ..

రాజకీయ అనిశ్చితి ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నేడు బలనిరూపణ జరగనుంది. వరుస రాజీనామాలతో మైనారిటీలో పడిపోయిన అధికార కాంగ్రెస్ కూటమి అనుసరించబోయే వ్యూహాలపై ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మాతృభాషలో బోధనతోనే నేర్పరితనం

పాఠశాల దశలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు పాలకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తున్న దేశాల్లో ఆంగ్లాన్ని కనీసం ఒక సబ్జెక్టుగా కూడా బోధించనివి చాలా ఉన్నాయి. ఒకవేళ బోధించినా ఇది విద్యార్థిలో ఎంతమేర నైపుణ్యాన్ని పెంచుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అనుమానం సాక్ష్యం కాదు

అనుమానాలు ఎంత బలంగా ఉన్నా.. నిందితులను శిక్షించాలంటే రుజువులు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒడిశాకు చెందిన హోంగార్డు మృతి కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కూలిన సైనిక విమానాలు

నైజీరియా రాజధాని అబుజా విమానాశ్రయం సమీపంలో ఓ సైనిక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అలబామాలో ఓ శిక్షణ విమానం కూలిపోయి ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నిపుణుల అండతోనే..

కుటుంబ వ్యాపార సంస్థలను అభివృద్ధి పథంలో నడిపించాలంటే.. నిపుణుల సలహాలు తప్పనిరసరి అని వాణిజ్య సలహాదారుడు డాక్టర్​ రామ్​ చరణ్​ అన్నారు. భవిష్యత్తు పట్ల వ్యూహంతో ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించిన ఆయన.. సీఈఓ ఎంపిక విషయంలో కఠినత్వం పాటించాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • జోక్‌ అనుకున్నా'

టీమ్​ఇండియాకు ఎంపికయ్యానని స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​ చెబితే జోక్​ చేస్తున్నాడని అనుకున్నానని యువ క్రికెటర్​ రాహుల్​ తెవాతియా అన్నాడు. అయితే, ఇంత త్వరగా భారత జట్టులో స్థానం దక్కుతుందని తాను ఊహించలేదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • బిగ్​బాస్​-14 విజేత?

హిందీ బిగ్​బాస్​ సీజన్-14 ముగిసింది. ఆదివారం ఉత్కంఠంగా సాగిన ఈ షో ఫినాలేలో బుల్లితెర నటి రుబినా దిలైక్​​ విన్నర్​గా నిలిచి ట్రోఫీని అందుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.