
పార్టీ నేతలతో.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు ఖరారుచేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తెరాస నేతలతో బుధవారం.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో రేపు ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల వ్యూహాలు ఖరారు చేయనున్నారు.
రేపటి సమావేశానికి నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, ఉపమేయర్, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి హాజరుకానున్నారు. రేపు సాయంత్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమవుతారు. పట్టభద్రుల ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇవాళ మూడు గంటలతో నామపత్రాల దాఖలుకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు ఈనెల 26 వరకు గడువు ఉంది.
ఇవీచూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు