ట్రాక్టర్ ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి
Breaking

కళాశాలకని బయలుదేరిన ఆ విద్యార్థిని.. ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించింది. నవ్వుతూ ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె తిరగిరాని లోకాలకు వెళ్లిందని.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతి నగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. రెవెన్యూ క్వార్టర్స్​కు చెందిన జువేరియా.. ఓ కళాశాలలో బైపీసీ మెుదటి సంవత్సరం చదువుతోంది.

కళాశాలకని స్కూటీపై బయలుదేరిన జువేరియాను.. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. తమ కుమార్తె మృతి చెందిందని తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఒకరి అజాగ్రత్త.. మరొకరి అతివేగం.. ఫలితం రోడ్డుప్రమాదం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.