నగర శివారులో లారీ బోల్తా.. భవన నిర్మాణ కార్మికుడు మృతి
One

ఓ లారీ బోల్తా పడి ఒకరు మృతి చేందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన హైదరాబాద్​లోని కొంపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భవన నిర్మాణం కోసం భారీ ఇనుప కడ్డీలను తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడడంతో ఒక వ్యక్తి మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన హైదరాబాద్​లోని కొంపల్లిలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కొంపల్లి ప్రాంతంలో నినీప్లాంట్​ ఎదురుగా ఫెయిర్ అండ్ ఫీల్డ్ నిర్మాణ సంస్థ భారీ భవన నిర్మాణాన్ని చేపడుతోంది. సెల్లార్‌ కోసం కావాల్సిన ఇనుప కడ్డీలను తీసుకొస్తున్న క్రమంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలోని ఇద్దరు వ్యక్తులపై ఇనుప రాడ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఉపేందర్ అనే కార్మికుడు మృతి చెందగా మహేందర్ అనే వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులిద్దరూ జార్ఖండ్​ చెందినవారిగా గుర్తించారు.

నగర శివారులో లారీ బోల్తా..

ఇదీ చదవండి: విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకొడుకు సజీవదహనం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.