సీసీ కెమెరాకు చిక్కిన పెట్రోల్ దొంగ
petrol

పెట్రోల్​ చోరీకి పాల్పడుతున్న దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఇళ్లముందు నిలిపి ఉన్న ద్విచక్రవాహనం నుంచి తస్కరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

రాత్రి సమయాల్లో ఇంటిముందు నిలిపిన ద్విచక్రవాహనం నుంచి పెట్రోల్​ చోరీ చేస్తున్న దొంగ సీసీ కెమెరాకు దొరికిపోయాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని వెంకటేశ్వర కాలనీ డివిజన్‌ స్టడీ సర్కిల్‌ వద్ద నిలిచి ఉన్న బైక్​ నుంచి పెట్రోల్​ తీస్తున్న దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయయ్యాయి. ఇవేవి గమనించని దుండగుడు పెట్రోల్ తస్కరించి పారిపోయాడు.

తమ వాహనాల నుంచి గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్‌ దొంగిలిస్తున్నారని బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ ఆగంతుకుడు పెట్రోల్‌ తస్కరిస్తున్న విషయం బయటపడింది. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన చోరీ దృశ్యాలు

ఇదీ చూడండి : యువకునిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.