బోధన్​ పాస్​పోర్టుల కేసులో ఇద్దరు పోలీసులు అరెస్ట్​: సీపీ సజ్జనార్​
Breaking

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో నకిలీ పాస్​పోర్టుల కేసులో 11 మంది ప్రధాన సూత్రదారులు ఉన్నారని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఆధార్​, ఇతర పత్రాలతో పాస్​పోర్టులు పొందినట్లు గుర్తించామన్నారు.

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో నకిలీ చిరునామాలు, పత్రాలతో 72 పాస్​పోర్టులు తీసుకున్నారని సైబరాబాద్​ సీపీ వీసీ సజ్జనార్​ వెల్లడించారు. ఒకే చిరునామా నుంచి 37 పాస్‌పోర్టులు తీసుకున్నారని తెలిపారు. పాస్​పోర్ట్ కుంభకోణంపై శంషాబాద్ ఎయిర్​ పోర్టు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన సైబరాబాద్ సీపీ.. వివరాలు వెల్లడించారు.

'ముగ్గురు ప్రయాణికుల పాస్​పోర్టులు అనుమానాస్పదంగా ఉన్నాయి. వారు స్థానికులు కాకపోయినా.. వారివద్ద బోధన్​ స్థానికతతో పాస్​పోర్టులు ఉన్నాయి. వారు దుబాయ్​ వెళ్లేందుకు యత్నించారు' అంటూ శంషాబాద్​ విమానాశ్రయ అధికారుల నుంచి ఫిర్యాదు అందిందని సీపీ సజ్జనార్​ వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు.

ఆ దారే ఎందుకు..?

ఈ కేసులో ప్రధాన నిందితుడు పరిమళ్​ బైన్​ .. బంగ్లాదేశ్​కి చెందినవాడని.. అక్రమంగా సముద్రమార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్​, ముగ్గురు బంగ్లాదేశ్​ దేశస్థులతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ప్రధాన నిందితుడు పరిమళ్​ బైన్​ ఒక్కో పాస్​పోర్టుకు రూ.10 వేలు నుంచి 30 వేలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. బంగ్లాదేశ్ నుంచి బోధన్ వచ్చి ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు వీరు ప్రయత్నాలు చేసినట్లు గుర్తించామన్నారు. భారత్‌ నుంచి ఎక్కువ వీసాలు పొందే అవకాశం ఉన్నందుకే ఈ దారి ఎంచుకున్నారని సీపీ చెప్పారు.

మిగిలిన వారెక్కడ..?

నకిలీ పత్రాలతో పాస్​పోస్టులు పొందిన వారిలో మొత్తం 19 మంది వివిధ దేశాలకు వెళ్లినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. మిగిలిన 49 మంది ఎక్కడున్నారో గుర్తించాల్సి ఉందన్నారు. నకిలీ ఆధార్​ కార్డులపై సంబంధిత విభాగానికి లేఖ రాశామన్నారు. పశ్చిమ బంగాలో పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకూ లేఖలు రాసినట్లు సీపీ సజ్జనార్​ తెలిపారు.

పాస్‌పోర్టుల విషయంలో అప్పటి ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్‌.. సరిగా విచారణ చేయకుండా మంజూరుకు సిఫార్సు చేశారని సీపీ చెప్పారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

బోధన్​ పాస్​పోర్టుల కేసులో ఇద్దరు పోలీసులు అరెస్ట్​: సీపీ సజ్జనార్​

ఇవీచూడండి: పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్‌

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.