
యజమాని వేధింపులు తాళలేక ఏపీలోని అనంతపురం జిల్లా పులగుట్టపల్లి పెద్దతండాకు చెందిన పెద్ద రంగనాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తన భార్యపై యజమాని లైంగిక వేధింపులను తట్టుకోలేక.. ఇలా చేసినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్దతండాకు చెందిన పెద్ద రంగనాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రంగనాయక్ అతని భార్యతో కలిసి పట్టణంలోని గుత్తి రోడ్డులో కిషోర్ అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టిలో ఏడాదిగా పని చేస్తున్నారు. యజమాని మాత్రం కూలీడబ్బులు అడిగితే.. తన భార్యను పంపి లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన చూడలేక మనస్థాపంతో పురుగుల మందు తాగానని పేర్కొన్నాడు.
ఏడాదిగా పని చేస్తే.. 6 నెలల కూలీ ఇచ్చారని, మిగిలిన జీతం చెల్లించమని అడిగితే.. మద్యం మత్తులో ఉన్న యజమాని లైంగిక కోరికలు తీర్చాలంటున్నాడని తెలిపాడు. కూలి డబ్బులు చెల్లించకుండా ఇటుకల బట్టి యజమాని కిషోర్ వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట కసాపురం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ట్రాలీ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి