'ఉగ్రవాదం.. మానవాళికి అతిపెద్ద ముప్పు'
Breaking

ఉగ్రవాదం ఎప్పుడూ సమర్థనీయం కాదని మానవ హక్కుల కోసం పోరాడే సంస్థలు గ్రహించాలని హితవు పలికారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఐరాస మానవ హక్కుల మండలి​ సమావేశంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు.

మానవాళికి అతిపెద్ద ముప్పుగా ఉగ్రవాదం కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం ఎప్పుడూ సమర్థనీయం కాదని మానవ హక్కుల సంస్థలు గ్రహించాలన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి 46వ ​సమావేశంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారు.. బాధితులతో సమానం కాదని పరోక్షంగా పాక్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

" ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భారత్​ ముందు వరుసలో నిలుస్తూ వస్తోంది. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా 8 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను గత నెల ఐరాసకు అందించింది భారత్​. ఈ విధానాన్ని అమలు చేసేందుకు మేము ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం."

-- ఎస్​. జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

కరోనా కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయన్నారు జైశంకర్. ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

కరోనాపై పోరులో వేర్వేరు దేశాలకు భారత్​ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు జైశంకర్.

ఇదీ చదవండి : ' 'కొవాక్స్' కోసం భారత్​ 1.1 బిలియన్ డోసులు'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.