'పుష్ప'లో బన్నీ మేకప్​ కోసం అన్ని గంటలా?
Allu

'పుష్ప' సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తికరంగా మారింది. ఇంతకీ అదేంటి? దాని సంగతేంటి?

అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కేరళలోని అడవుల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ మేకప్​ గురించి ఆసక్తికర విషయం ప్రస్తుతం టాలీవుడ్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

allu arjun pushpa cinema
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ క్లినర్​గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం పూర్తిగా టాన్​ లుక్​లో కనిపించాలి. దీంతో రోజులో నాలుగు గంటల పాటు బన్నీ మేకప్​ కోసమే కేటాయించాల్సి వస్తోందట.

ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.