ఆ జంటతో 'ఉప్పెన' హిందీ రీమేక్​!
Breaking

'ఉప్పెన' హిందీ రీమేక్​కు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రంలో ఇషాన్​ ఖట్టర్​, అనన్య పాండే నటించే అవకాశముంది.

ఓ భాషలో విజయవంతమైన కొన్ని చిత్రాలు మరో భాషలోకి రీమేక్‌ అవుతుంటాయి. ఈ క్రమంలోనే.. ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన 'ఉప్పెన' సినిమా బాలీవుడ్​ రీమేక్​ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. యువ హీరో ఇషాన్ ఖట్టర్​, హీరోయిన్ అనన్య పాండే ఈ చిత్రంలో నటించనున్నట్లు వినికిడి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ishan ananya
ఇషాన్​, అనన్య

మెగాహీరో వైష్ణవ్​తేజ్​, కృతి శెట్టి జంటగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్​ సేతుపతి కీలక పాత్ర పోషించారు. అయితే ఈయన.. ఈ సినిమాకు సంబంధించిన తమిళ హక్కులను ఇప్పటికే సొంతం చేసుకున్నారని సమాచారం.

ఇదీ చూడండి: 'ఉప్పెన' టీమ్​కు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్​లు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.