ఇరువురు భామలు.. ఇరుకున హీరోలు!
Breaking

హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ కిక్కే వేరు. వారిద్దరితో కథానాయకుడు చేసే రొమాన్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. హీరో ఏ నాయికని ప్రేమిస్తాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? అనే ఉత్కంఠ కూడా ఉంటుంది. ఇలా టాలీవుడ్​లో ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్ల చిత్రాలు చాలానే వచ్చాయి. ఈ ఏడాదిలోనూ కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం.

ఒకే హీరోని రెండు విభిన్న పాత్రల్లో చూస్తే ప్రేక్షకులకు ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అదే హీరో పక్కన ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తే అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఏ నాయికని ప్రేమిస్తాడు? ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు? అంటూ సినిమా మొదలైన క్షణం నుంచే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇలా ఇద్దరు భామల మధ్య నలిగిపోయే కథానాయకుల కథలు టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. అవేంటి.. ఎవరా నాయకానాయికలు? చూసేద్దాం.

ఇద్దరున్నా.. ఒకరితోనేనా!

నితిన్‌ గతంలో నటించిన 'అల్లరి బుల్లోడు', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'అ ఆ' తదితర చిత్రాల్లో ఇద్దరు నాయికలు కనిపించారు. 'చెక్‌'తో మరోసారి ఇద్దరు భామలతో సందడి చేయనున్నారు. నితిన్‌ కథానాయకుడిగా వైవిధ్య దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన చిత్రం 'చెక్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నాయికలు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. చదరంగం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్‌ ఖైదీగా కనిపించనున్నారు. రెండు అందాలు ఉన్నప్పటికీ నితిన్‌.. ప్రియతోనే రొమాన్స్‌ చేసినట్లు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. అతనికి సాయం చేసే లాయర్‌ పాత్ర పోషించింది రకుల్‌. ఈ ఇద్దరు భామలతో నితిన్‌ చేసిన సందడి చూడాలంటే ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే.

Two Heroins pair up with one Hero
చెక్

'జగదీష్‌'కు జోడీగా!

నాని సరసన ఇద్దరు కథానాయికలుంటే ఎంత వినోదం ఉంటుందో 'అలా మొదలైంది', 'పిల్ల జమీందార్‌', 'జెంటిల్‌మేన్‌', 'మజ్ను', 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలు తెలియజేశాయి. మరోసారి టక్ జగదీష్​తో అదే సరదాని ప్రేక్షకులకు అందించనున్నారు నేచురల్ స్టార్. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రమిది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఇంకోసారి ఇంకోసారి' లిరికల్‌ వీడియో నాని-రీతూ మధ్య బంధాన్ని తెలియజేసింది. ఐశ్వర్యతో నాని కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఏప్రిల్‌ వరకు ఆగాల్సిందే.

Two Heroins pair up with one Hero
టక్ జగదీష్

'శ్యామ్‌ సింగరాయ్‌'కీ ఇద్దరున్నారు

'టక్‌ జగదీష్‌' తర్వాత నాని నటిస్తున్న 'శ్యామ్‌ సింగరాయ్‌'లోనూ ఇద్దరు నాయికలు ఎంపికయ్యారు. 'టాక్సీవాలా' ఫేం రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

Two Heroins pair up with one Hero
శ్యామ్ సింగరాయ్

'ఖిలాడి' జోడీ

ఇద్దరు బ్యూటీస్‌తో మాస్‌ మహారాజా రవితేజ చేసే అల్లరే వేరు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో ఇద్దరు నాయికలతో ఆడిపాడిన ఆయన 'ఖిలాడి'తో అదే జోరు కొనసాగించనున్నారు. 'వీర' చిత్రం తర్వాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా 'ఖిలాడి'. ఏ స్టూడియోస్‌ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రవితేజ శైలిలో సాగే మంచి వినోదాత్మక చిత్రం. రవితేజ సరసన నాయికలు మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతీ నటిస్తున్నారు. వీళ్లతో రవితేజ చేసిన హంగామా చూడాలంటే మే 28వరకు ఆగాల్సిందే.

Two Heroins pair up with one Hero
ఖిలాడి

ఎవరితో 'సీటీమార్‌'

తమన్నా, దిగంగన సూర్యవంశీతో అలరించేందుకు సిద్ధమయ్యారు గోపీచంద్‌. మరో అందం అప్సరా రాణి ప్రత్యేక గీతంలో కనువిందు చేయబోతుంది. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం 'సీటీమార్‌'. సంపత్‌ నంది దర్శకుడు. శ్రీనివాసా సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోందీ సినిమా. కోచ్‌ పాత్రలు పోషిస్తున్నారు గోపీచంద్‌, తమన్నా. ఓ జట్టు సభ్యురాలిగా దిగంగన కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కాబోతుంది.

Two Heroins pair up with one Hero
సీటీమార్

ఇవీ చూడండి: టాలీవుడ్ మల్టీస్టారర్​లు.. క్రేజీ కాంబోలు!

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.