విజయ్ హజారే ట్రోఫీలో కరోనా కలకలం
Vijay

విజయ్ హజారే టోర్నీలో ఓ బిహార్​ క్రికెటర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతని సహచర ఆటగాళ్లకూ కొవిడ్ టెస్టులు చేయనున్నారు. టోర్నీ నిమిత్తం బిహార్​ నుంచి 22 మంది ప్లేయర్లు బెంగుళూరు వచ్చారు.

విజయ్​ హజారే ట్రోఫీలో ఆడుతున్న బిహార్​ ఆటగాడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. దీంతో అతని సహచర ప్లేయర్లకూ కొవిడ్​ టెస్టులు చేయనున్నారు. ఆ రిపోర్టులు బుధవారం సాయంత్రం రానున్నాయి. ఈ టోర్నీ కోసం బిహార్​ 22 మంది క్రికెటర్లను పంపింది.

"బిహార్​కు చెందిన ఓ ఆటగాడికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం అతడు మిగతా క్రికెటర్లకు దూరంగా బెంగుళూరులో ఐసోలేషన్​లో ఉన్నాడు" అని సీనియర్​ అధికారి తెలిపాడు.

ప్రస్తుతం ఎలీట్​ గ్రూప్​-సీలో ఉన్న బిహార్​ జట్టు.. తన లీగ్​ మ్యాచ్​లన్నీ బెంగుళూరులో ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్​ బుధవారం ఉత్తర్​ప్రదేశ్​తో జరగాల్సి ఉంది. కరోనా కలకలం రేగినా.. మ్యాచ్​లు యథావిధిగా జరుగుతాయని బిహార్​ క్రికెట్​ అసోసియేషన్​ పేర్కొంది.

కొవిడ్​ అనంతరం బీసీసీఐ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద టోర్నీ ఇదే.

ఇదీ చదవండి: మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా?

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.