
సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయాలని గుస్సాడి నృత్య కళాకారుడు కనగరాజు అన్నారు. పద్మశ్రీ అవార్డ్కు ఎంపికైన సందర్భంగా తుడెందెబ్బ నాయకులు ఆదిలాబాద్ జిల్లాలో ఆయనను సన్మానించారు.
పద్మశ్రీ అవార్డ్కు ఎంపికైన గుస్సాడీ నృత్య కలాకారుడు కనగరాజును ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తుడుం దెబ్బ నాయకులు, స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కనగరాజు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ.. భవిష్యత్ తరాలకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనగరాజు 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2020లో పద్మశ్రీ అవార్డ్కు ఎంపిక చేసింది.
ఇదీ చదవండి: నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి