
విశాఖ జిల్లాలోని శ్రీ శారదాపీఠంలో వార్షికోత్సవాలు ముగిశాయి. అష్టోత్తర శత హస్తాలతో కొలువుదీరిన రాజశ్యామల అమ్మవారికి.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు హాజరయ్యారు.
విశాఖలోని శ్రీ శారదాపీఠంలో అష్టోత్తర శత హస్తాలతో కొలువుదీరిన రాజశ్యామల అమ్మవారికి.. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల యాగం అద్భుతంగా సాగిందని, శాస్త్రోక్తంగా, ధర్మబద్ధంగా యాగం నిర్వహించామని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే మార్పు తీసుకొచ్చిన యాగం అని.. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదా పీఠానికి పేటెంట్ లాంటిదని ఆయన చెప్పారు.
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి
అమ్మవారి మహిమ గురించి తెలుసుకొని ఇతర రాష్ట్రాల భక్తులు కూడా వస్తున్నారని.. శ్రీ చక్ర స్వరూపిణి దయతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. యాగంలో ఆఖరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు హాజరయ్యారు.
ఇదీ చదవండి: యాదాద్రీశుడి దర్శనానికి బారులు తీరిన భక్తజనం