ఫ్లెక్సీ వివాదం: పల్లాపై ​ఈసీకి భాజపా ఫిర్యాదు
telangana

పట్టభద్రుల నియోజకవర్గం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డిపై భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదుచేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి నామినేషన్​ సందర్భంగా నల్గొండ పట్టణంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై.. భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదుచేశారు. పల్లా.. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్నారు.

తమ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఫ్లెక్సీలకు అనుమతించని అధికారులు తెరాసకు అనుమతిచ్చారని ఎస్​ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. నల్గొండలో తెరాస నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదుచేశారు. రాజేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని భాజపా నేతలు కోరారు.

ఇవీచూడండి: వివాదంగా మారిన పల్లా ఫ్లెక్సీలు... తొలగించే పనిలో అధికారులు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.