
పీవీ నరసింహారావు కుమార్తెను పట్టభద్రుల స్థానానికి తెరాస అభ్యర్థిగా ప్రకటించడం పెద్ద నాటకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల రాక పట్ల పెద్ద భయపడాల్సిన అవసరం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ చిత్రపటాన్ని అంతరిక్షంలోకి పంపాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని నారాయణ అన్నారు. రాకెట్ వేగంతో పెరుగుతోన్న పెట్రోలు, డీజిల్ ఫొటోలనూ పంపాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వరవరరావుకు బెయిల్ మంజూరవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పేరుచెప్పి సామాన్యుల జేబులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లగొడుతున్నారని విమర్శించారు.
పీవీ నరసింహరావు కుమార్తె వాణీదేవిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పెద్ద నాటకమన్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రావడం పట్ల పెద్దగా భయపడాల్సిన పనిలేదని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు