
ఏపీలో పుర, నగరపాలిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో పుర, నగరపాలిక ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు దాటిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
పస్తుతం ఏపీలో కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. పుర, నగరపాలిక ఎన్నికల్లో కొత్తవారు కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పాస్‌పోర్టు కుంభకోణంలో 8 మంది అరెస్టు: సీపీ సజ్జనార్