
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ తనపై పోటీ చేసినా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమవైపు ఉన్నారని స్పష్టం చేశారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంచందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తనపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పోటీ చేసినా గెలవరని ధీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నానని.. జనం తనవైపే ఉన్నారని స్పష్టం చేశారు. అంతకు ముందు బర్కత్‌పురాలోని భాజపా నగర కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఎంపీ ధర్మపురి అర్వింద్, కార్యకర్తలతో వచ్చి రిటర్నింగ్ అధికారికి రాంచందర్ రావు నామినేషన్ పత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లో వరదల సమస్యను మూడేళ్ల క్రితమే మండలిలో నిలదీసినట్లు తెలిపారు. కుటుంబ పాలన కోసమే తెలంగాణ వచ్చిన్నట్లు ఉందని సీఎంను దుయ్యబట్టారు. ఏ ఎన్నికల్లోనైనా తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎంపీ అర్వింద్ అన్నారు. భారీ మెజార్టీతో రాంచందర్‌రావు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం