ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి : ఈయూ
rtc

ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్​లోని కార్మికశాఖ కమిషనర్​ కార్యాలయం ముందు నినాదాలు చేశారు.

హైదరాబాద్​లోని కార్మికశాఖ కమిషనర్​ కార్యాలయం ముందు ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ట్రేడ్​ యూనియన్ చట్టాలను అమలు చేయాలని కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు.

అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం డ్యూటీల విధానం ఉండాలని కమిషనర్​ను కోరారు. ఇప్పటిదాకా వేతన సవరణ చేయకపోవడాన్ని కార్మిక నేతలు తప్పుబట్టారు. ఎన్నికలు నిర్వహించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చూడండి : నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2019 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.