
ఆక్రమణకు గురైన భూదాన్ భూములపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని... అఖిల భారత సర్వ సేవ సంఘ్ సర్వోదయ ట్రస్టీ షేక్ హుస్సేన్ కోరారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పాలక మండలి రద్దు చేసి ఆరేళ్లు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నూతన పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
భూమి లేని పేదలకు ఇచ్చే భూదాన్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అఖిల భారత సర్వసేవ సంఘ్ సర్వోదయ ట్రస్టీ షేక్ హుస్సేన్ కోరారు. స్వచ్ఛంద, అహింసా మార్గంగా ఆచార్య వినోబాభావే కూడగట్టిన భూదాన్ భూములు.. నేడు ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బషీర్ బాగ్లో తెలంగాణ సర్వోదయ మండలి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూదాన్ ఉద్యమాన్ని దాదాపు 70 ఏళ్ల క్రితం మొదటగా తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ప్రారంభించారని షేక్ హుస్సేన్ తెలిపారు. భూదాన్ భూ వివాదాలను పరిష్కరించడానికి ఫాస్ట్ట్రాక్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పాలక మండలి రద్దు చేసి ఆరేళ్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నూతన పాలక మండలి ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి: నడ్డా సమక్షంలో భాజపాలో చేరిన శ్రీశైలం గౌడ్