మీ పోరాటానికి నా మద్దతు ఉంటుంది: షర్మిల

గిరిజన శక్తి నాయకులు వైఎస్ షర్మిలను కలిశారు. తమ పోరాటానికి మద్దతు తెలపాలని వారు కోరారు. గిరిజన నాయకులకు తన మద్దతు ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారు.
గిరిజన తండా బోర్డు ఏర్పాటు, ఎస్టీలకు సంబంధించిన భాష అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గిరిజన శక్తి నాయకులు వైఎస్ షర్మిలను కలిశారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు... వైఎస్సార్ హయాంలో పోడు భూములు ఇచ్చారని... కానీ తెరాస ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజనుల పోరాటానికి తన మద్దతు ఉంటుందని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. షర్మిలను కలిసిన వారిలో గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ఎం.వెంకటేశ్ చౌహాన్, జాతీయ అధ్యక్షుడు ధరావత్ రాజేశ్ నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.శరత్ నాయక్ తదితరులు ఉన్నారు.
- ఇదీ చూడండి : జీవశాస్త్రాల పురోగతికి ఔషధం