టాప్​టెన్​ న్యూస్@3PM
టాప్​టెన్​

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

1. నిందితుల కస్టడీకి పిటిషన్​

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ కోరుతూ మంథని కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణ జరుగుతోంది. కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరి కస్టడీని కోరుతూ రామగిరి పోలీసులు పిటిషన్ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. నామినేషన్ల పర్వం

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జోరుగా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నుంచి బీ-ఫాం అందుకున్న వాణీదేవి... మంత్రులతో కలిసి జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. టీకాల రాజధానిగా హైదరాబాద్‌

ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్‌ ఉండటం ఎంతో గర్వకారణమని వెల్లడించారు. హైదరాబాద్​ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్... భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకా తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ధరల పెంపుపై రాహుల్‌ ఆగ్రహం

కేంద్రం సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తోందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఇంధన ధరలు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'గత పాలకుల వల్లే అసోం వెనుకబాటు'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన అసోం పర్యటనలో భాగంగా చమురు, గ్యాస్​ ప్రాజెక్ట్​లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వాల పాలన వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఆ కేసులో గంభీర్​కు సీబీఐ ఉచ్చు!

బంగాల్​లో బొగ్గు చౌర్యం కేసులో అభిషేక్ బెనర్జీ భార్య సోదరి మేనకా గంభీర్​ను ప్రశ్నించేందుకు ఆమె ఇంటికి వెళ్లారు సీబీఐ అధికారులు. ఈ కేసుకు సంబంధించి అభిషేక్ భార్యతో పాటు, ఈమెకు ఆదివారమే నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అమెరికాలో 5లక్షలకు చేరువలో

అమెరికాలో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. వైరస్​ సోకి మరణించినవారి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష దంపతులు ఈ రోజు రాత్రి శ్వేతసౌధంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించి, మౌనం పాటించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఫ్యూచర్​ రిటైల్​, బియానీకి నోటీసులు

ఫ్యూచర్​ రిటైల్​-అమెజాన్​ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అమెజాన్​ వాదనపై స్పందించాలని ఫ్యూచర్​ రిటైల్​, కిశోర్​ బియానీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. ఐదు వారాల తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


9. 'ధోనీతో కలిసి ట్రోఫీ..: ఉతప్ప'

సీఎస్​కే కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ సారథ్యంలో ఆడేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని వెటరన్​ క్రికెటర్​ రాబిన్​ ఉతప్ప అన్నాడు. ఐపీఎల్​లో ట్రేడింగ్​ పద్ధతిలో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులో చేరిన ఉతప్ప.. ఆ జట్టు అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ వీడియోను సీఎస్​కే ఫ్రాంచైజీ ట్విట్టర్​లో పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఓటీటీలో ధనుష్‌ చిత్రం

ధనుష్​‌ కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'జగమే తందిరమ్‌'. తెలుగులో 'జగమే తంత్రం' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.