
ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో తన్వాల్ ఎలక్ట్రానిక్ ద్విచక్రవాహనాన్ని కార్పొరేటర్ శ్రీదేవితో కలిసి ఆయన ప్రారంభించారు.
రేపటి తరాలను కాపాడాలంటే ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన తన్వాల్ ఎలక్ట్రానిక్ ద్విచక్రవాహనాన్ని కార్పొరేటర్ శ్రీదేవితో కలిసి ప్రారంభించారు.
ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగిస్తే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేవారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయని ఆయన తెలిపారు. ఈ తరహా వాహనాలకు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్లు ఉండవని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్