కోటి వృక్షార్చనకు ప్రపంచ రికార్డులో చోటు
Breaking

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమానికి... విశ్వగురు వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినం పురస్కరించుకుని ఒకే రోజు, గంట సమయంలో కోటి మెుక్కలు నాటిన ఘనతకు ఈ ప్రపంచ రికార్డు వరించింది.

సీఎం కేసీఆర్ జన్మదినం రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం రికార్డులకెక్కింది. గంట సమయంలో కోటి మొక్కలు నాటినందుకుగాను విశ్వగురు వరల్డ్ రికార్డ్స్​లో స్థానం లభించింది.

సమాజానికి ఉపయోగపడే అద్వితీయమైన కార్యక్రమాలను గుర్తించి తన రికార్డ్స్​లో స్థానం కల్పించే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ కోటి వృక్షార్చనకు చోటు కల్పించింది. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్​ను సంస్థ అభినందించింది. రేపటి తరం కోసం చేస్తున్న నిస్వార్థమైన సేవగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను పేర్కొంది. ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించింది.

కోటి వృక్షార్చనకు ప్రపంచ రికార్డులో చోటు

ఇదీ చదవండి: 'ఏ మహమ్మారికైనా హైదరాబాద్​ నుంచే టీకా రావాలి'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.