నాగమడుగు ప్రాజెక్టుకు రూ.476 కోట్లు మంజూరు: ప్రశాంత్​ రెడ్డి
Minister

కామారెడ్డి జిల్లాలో నాగమడుగు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్​లో గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, సహకార సంఘం అదనపు గదులను ప్రారంభించి... కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు.

నాగమడుగు ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ హాజరవుతారని... రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.476 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్​లో జడ్పీ ఛైర్మన్​ శోభారాజు, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Minister Prashant Reddy said Rs 476 crore sanctioned for the Nagamadugu project in Kamareddy district
నాగమడుగు ప్రాజెక్టుకు రూ.476 కోట్లు మంజూరు: ప్రశాంత్​ రెడ్డి

రాజీనామాకు సిద్ధం...

కొండ పోచంపల్లి నుంచి హల్ది వాగు ద్వారా నిజాంసాగర్​కు త్వరలో సాగు నీరు వస్తాయని... ఆయకట్టు కింద రెండు పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. సీఎం కేసీఆర్​పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇచ్చినంత పింఛన్లు దేశంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదన్నారు. ఒకవేళ ఇచ్చినట్లయితే తన మంత్రి పదవి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Minister Prashant Reddy said Rs 476 crore sanctioned for the Nagamadugu project in Kamareddy district
నాగమడుగు ప్రాజెక్టుకు రూ.476 కోట్లు మంజూరు: ప్రశాంత్​ రెడ్డి

రైతులకు అండగా...

తెరాస ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్​ పంట పెట్టుబడి సాయం, బీమా పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించిందని... జడ్పీ ఛైర్ పర్సన్ శోభారాజు తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ పని చేస్తున్నారని... జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చెప్పారు.

ఇదీ చదవండి: రీజనల్‌ రింగ్‌రోడ్డు కల సాకారం కాబోతుంది: కిషన్​రెడ్డి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.