నేడు పారువెల్ల లక్ష్మీగణపతి శోభాయాత్ర

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్లలో కొలువైన లక్ష్మీగణపతి దశమ వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. నేడు సాయంత్రం స్వామి వారి శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ఆదిదేవుడు, కలియుగ ప్రథమ ఆరాధ్య దైవం లక్ష్మీగణపతి దశమ వార్షికోత్సవం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్లలో ఘనంగా జరుగుతోంది. దశమ వార్షికోత్సవంలో భాగంగా రెండో రోజు సామూహిక కుంకుమార్చనలు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలొచ్చి గణనాథుడికి మొక్కులు సమర్పించుకున్నారు. నేడు సాయంత్రం స్వామి వారి శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: న్యాయవాదుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్