మమత థియేటర్‌లో ఉప్పెన సినీ బృందం సందడి

కరీంనగర్ మమత థియేటర్‌లో ఉప్పెన చిత్ర బృందం సందడి చేసింది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులుకు చిత్ర బృందంకృతజ్ఞతలు తెలిపింది.
కరీంనగర్‌లోని మమత థియేటర్‌లో ఉప్పెన సినిమా బృందం సందడి చేసింది. ఈ సినిమా ప్రదర్శన కొనసాగుతుండగా సినీడైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు హీరో సాయివైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి థియేటర్‌కు చేరుకున్నారు.
సినీ బృందం రావడంతో వీక్షకుల్లో ఆనందం చోటు చేసుకుంది. ఉప్పెనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా తెర ముందుకు వచ్చి కృతజ్ఞతలు చెప్పడంతో ప్రేక్షకులు కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.