
జిల్లాలో సహృదయ వాతావరణం నెలకొల్పేందుకు.. ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖలతో కలిసి క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన క్రీడా ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన క్రీడా ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లాలో సహృదయ వాతావరణం నెలకొల్పేందుకు.. ప్రజా ప్రతినిధులు వివిధ శాఖలతో కలిసి క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. సీపీ కమల్‌హాసన్ రెడ్డి జిల్లాకు విచ్చేసిన తర్వాత ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే.. శాంతి, భద్రతలు కాపాడటంలో తమదైన పాత్ర పోషించారని కొనియాడారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
ఇదీ చదవండి: ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. సామాజిక మాధ్యమంలో ప్రశంసలు