
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రైతుల సమస్యలను శాసనసభలో వినిపించి ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.
రైతులను నష్టపరిచే నూతన వ్యవసాయ చట్టాలపై చట్టసభల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ ముందుంటుందని.. యాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను శాసనసభలో వినిపించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ‘రైతు పొలంబాట- పోరుబాట’ ముగింపు సభను ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో సోమవారం రాత్రి నిర్వహించారు.
చర్చల ద్వారానే నల్లచట్టాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రం పాములా కరవడానికి వస్తోందని.. దాన్ని కర్రతో కొట్టాలని, రాష్ట్రం తేలులా విషం చిమ్మడానికి వస్తోందని దాన్ని నలిపివేసి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ మధుయాస్కీ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పీవీ కుమార్తెను బరిలోకి దింపింది అందుకే : రేవంత్