
మనిషి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు సహజ యోగా ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. ప్రపంచ బ్రహ్మ చైతన్ దివాస్ మహోత్సవం సందర్భంగా ఈస్ట్ కమలానగర్‌లో ధ్యానం పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మేడ్చల్ జిల్లా ఈస్ట్ కమలానగర్‌లోని సహజ యోగా ధ్యాన కేంద్రంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ధ్యానం మనిషిని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు సహకరిస్తుందని తెలిపారు. దానికి సంబంధించిన ఛాయా చిత్ర, వీడియో ప్రదర్శనను మేయర్ ఆవిష్కరించారు.
శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవేశ పెట్టిన సహజ యోగ ధ్యానాన్ని ఎలాంటి రుసుం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చని ధ్యాన కేంద్రం ప్రతినిధి మల్లారెడ్డి పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని అన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ధ్యానం సహకరిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: అక్కడ కరోనా కేసుల పెరుగుదల.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం