'మేడారానికి డీఎస్పీ పాదయాత్ర'
Nizamabad

తెలంగాణ గాంధీగా సీఎం కేసీఆర్​ చరిత్రలో నిలిచిపోతారని... నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ బెటాలియన్‌ డీఎస్పీ ఎస్‌.విష్ణుమూర్తి అన్నారు. ఆయన పాలన సాఫీగా సాగాలని ఫిబ్రవరి 17న కరీంనగర్ నుంచి మేడారానికి పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేటకు చేరుకున్నారు.

నిజామాబాద్​ జిల్లా డిచ్‌పల్లి 7వ స్పెషల్‌ బెటాలియన్‌ డీఎస్పీ ఎస్‌.విష్ణుమూర్తి... కరీంనగర్​ నుంచి మేడారానికి చేపట్టిన పాదయాత్ర సోమవారం ములుగు జిల్లా గోవిందరావుపేటకు చేరుకుంది. ముఖ్యమంత్రి​ జన్మదినం సందర్భంగా ఆయన పాలన సాఫీగా సాగాలని ఫిబ్రవరి 17న మానకొండూరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ గాంధీగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ బాగుండాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేపట్టినట్లు డీఎస్పీ విష్ణుమూర్తి చెప్పారు.

ఇదీ చదవండి: పోలీసుల నుంచే తప్పించుకోబోయి.. ఎస్సైనే ఢీ కొట్టాడు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.