
శ్రీ సంతుసేవాలాల్ జయంతి ఉత్సవాలు నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలో ఘనంగా నిర్వహించారు. చెట్టుకు, పుట్టకు ఒక్కొక్కరిగా ఉన్న గిరిజనులను ఏకతాటి పైకి తెచ్చిన ఘనత సేవాలాల్దేనని కొనియాడారు.
చెట్టుకొక్కరు పుట్టకొక్కరిగా ఉన్న గిరిజనులను ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత శ్రీ సంతు సేవాలాల్దేనని అఖిల భారత బంజారా సేవా సంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇస్లావత్ రామచందర్ నాయక్ కొనియాడారు. తండాల ఏర్పాటులో ఆయన కృషి ఎనలేనిదన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల, త్రిపురారం, నిడమనూరు, తిరుమలగిరి, పెద్దవూర, గుర్రంపోడ్లో శ్రీ సంతుసేవాలాల్ 282 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వం తరపున జిల్లా బంజారా సంక్షేమ సంఘం పీడీ రాజ్ కుమార్, అధికారులు, నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షు నాయక్, మండలాల నాయకులు పాల్గొన్నారు.