
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులపై ఓ బాధితుడు.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకొని.. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇంటి నిర్మాణాన్ని అడ్డుకొని దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీసులపై ఓ బాధితుడు.. హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాడు. బొంగుళూరు గ్రామానికి చెందిన తూపల్లి భాస్కర్ రెడ్డి.. గతేడాది తుర్కయాంజల్‌లో 244 గజాల భూమిని కొనుగోలు చేశాడు. ఆదిభట్ల మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకొని ఇంటి నిర్మాణం చేపట్టాడు.ఇంటి నిర్మాణం జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన కొత్తకుర్మ బాలరాజ్, కొత్తకుర్మ వెంకటేష్, కొత్తకుర్మ కుమార్, శ్రీశైలం తదితరులు పనులను అడ్డుకున్నారని వివరించాడు. అంతేకాకుండా కాంట్రాక్టర్ రాహుల్‌పై దాడి చేశారని తెలిపాడు.
ఈ విషయంపై ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశానని... ఎస్సై సురేష్ కేసు నమోదు చేయకుండా తమనే పనులు ఆపేయాలని చెప్పినట్లు కమిషన్‌కు బాధితుడు వివరించాడు. న్యాయం కోసం రాచకొండ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. భూ వివాదంలో భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకొని.. తమకు రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని వేడుకున్నాడు.
ఇదీ చదవండి: సీఎం సెక్రటరీ తెలుసంటూ మోసాలు.. అరెస్టు చేసిన పోలీసులు