
సంగారెడ్డి జిల్లాలోని హరిదాస్పూర్లో కన్యావందనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఆయన పారాణి రాశారు.
ఆడపిల్ల పుట్టడాన్ని పండగలా భావించే గ్రామాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండారెడ్డి మండలం హరిదాస్పూర్లో నిర్వహించిన కన్యావందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. పలువురు చిన్నారులకు స్వామీజీ స్వయంగా పసుపు కుంకుమతో పారాణి రాశారు.
ఆడపిల్లలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ జటాయువులా ధీరత్వాన్ని ప్రదర్శించాలని అర్చకులు రంగరాజన్ తెలిపారు. కన్యాదానం కార్యక్రమానికి తన వంతు సాయంగా రూ. 5000ను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నగేశ్, డీఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఊరికోసం సొంత ఖర్చులతో ఎన్ఆర్ఐ సేవలు.!