యాదాద్రి పాతగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం
brahmothsavalu

యాదాద్రి పాతగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం పది గంటలకు స్వస్తివాచనంతో ప్రారంభమైన వేడుకలు... ఈ నెల 28న నిర్వహించే శతఘటాభిషేకంతో ముగియనున్నట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందాలని కోరారు.

యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య, సన్నాయి మేళాల హోరులో బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలైనాయి. ముందుగా పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసిన అనంతరం లక్ష్మీసమేత నారసింహులకు రక్షాబంధనం గావించారు. అనంతరం వేదపండితుల పారాయణాల మధ్య, సన్నాయి మేళాల హోరులో పుణ్యాహవచనం తంతును వైభవంగా నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తెప్పించిన పూలతో... స్వామి, అమ్మవార్లను చూడముచ్చటగా ముస్తాబు చేశారు. వజ్రవైడ్యుర్యాలు, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వస్తివాచనంతో మొదలైన పాతగుట్ట బ్రహ్మోత్సవాలు 28న నిర్వహించే శతఘటాభిషేకంతో ముగియనున్నాయని ఈవో గీతారెడ్డి వెల్లడించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు పొందాలని కోరారు. 24న స్వామివారి ఎదుర్కోలు, 25న తిరుకల్యాణం, 26న రథోత్సవం వైభవంగా జరపనున్నట్టు ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.

ఇదీ చూడండి: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.